బండి సంజయ్ ఓ బచ్చా.. నేనంటే అందరికి హడల్ : మైనంపల్లి కౌంటర్

బండి సంజయ్ పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. అరేయ్ గుండుగా అంటూ సంభోదించిన ఎమ్మెల్యే మైనంపల్లి.. బండి సంజయ్ ఓ హుమనైజర్ అని మండిపడ్డారు. “నా ముందు బండి సంజయ్ ఓ బచ్చా. మైనంపల్లి కోసం అన్ని జిల్లాలు కలిసి వస్తాయి… మైనంపల్లి అంటే అందరికి హడల్.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

అందుకే కరీంనగర్ ఎమ్మెల్యేగా ప్రజలు ఓడగొట్టారని చురకలు అంటించారు. బండి సంజయ్ చుట్టూ ఉన్నది భూ కబ్జాదారులేనని… మల్కాజిగిరి బీజేపీ నేతలు ఓ పోలీసు అధికారి పై చేయి చేసుకున్నారని మండి పడ్డారు మైనంపల్లి హనుమంతరావు. టిఆర్ఎస్ కార్యకర్తలపై కూడా దాడి చేశారన్నారు. బండి సంజయ్ గూండాయిజం చేస్తున్నారని… మల్కాజిగిరి వచ్చి నన్ను రెచ్చగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ను కలిశానని ఆధారాలు చూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఎల్లప్పుడూ మల్కాజిగిరి అభివృద్ధిని కోరుకునేది మైనంపల్లి హనుమంతరావు అని తెలిపారు.