తెలంగాణ రాజకీయం ఇప్పుడు మనుగోడు నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న సభ సందర్బంగా సీఎం కేసీఆర్ ఓ చిన్న కుట్ర పన్నాడన్నారు. ఆదివారం రోజు ఉపాధి హామీ పనులు ఉండవు..దీంతో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామంటూ పంచాయతీ కార్యాలయాల దగ్గర జనాలను కూర్చొపెట్టి సర్పంచ్ లు బతిమిలాడుకుంటున్నారని వెల్లడించారు రఘునందన్ రావు. మోటార్లకు మీటర్లు పెట్టాలని జీవో ఇచ్చారా ? పార్లమెంట్ లో బిల్లు పాసైందా ? చెప్పాలని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు రఘునందన్ రావు. మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు రఘునందన్ రావు.
2020, నవంబర్ నెలలో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే.. బావుల దగ్గర మీటర్లు పెడుతారని చెప్పారని.. మరి మీటర్లు పెట్టారా ? ప్రశ్నించారు. హుజూరాబాద్ జరిగిన ఉప ఎన్నికలో ఇదే విధంగా మాట్లాడారని.. కానీ ప్రజలు ఏ తీర్పునిచ్చారో తెలుసుకోవాలని సూచించారు రఘునందన్ రావు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. నాలుగో ఆరును గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని రఘునందన్ రావు తెలిపారు. మూడున్నర సంవత్సరాలుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనేక ఇబ్బందులు పెట్టారని తెలిపారు రఘునందన్ రావు. అభివృద్ధి జరపాలని ప్రభుత్వం వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని, కానీ.. అలాంటి జరగకపోవడం, కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుండడంతో ఆయన
పార్టీకి రాజీనామా చేశారన్నారు రఘునందన్ రావు.