కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకురావాలి : ఎంపీ అర్వింద్‌

-

తెలంగాణ రాజకీయం ఇప్పుడు మనుగోడు నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మంచి చేస్తాడని భావించి ప్రజలు అధికారం ఇస్తే… రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు ఎంపీ అర్వింద్‌.

దేశంలో మిగతా సీఎంల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న కేసీఆర్… ప్రజల గురించి పని చేయడం మానేసి ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని విరుచుకుపడ్డారు ఎంపీ అర్వింద్‌. రాష్ట్రానికి న్యూక్లియర్ బాంబ్లా కేసీఆర్ తయారయ్యారని ఎంపీ అర్వింద్‌ అభివర్ణించారు. తన పాలనలో భూముల రేట్లు బాగా పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించామని చెబుతున్న కేసీఆర్… భూనిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించడంలేదని ఎంపీ అర్వింద్‌ ప్రశ్నించారు. శివలింగంపై తేలులా, గర్భగుడిలో గబ్బిలంలా కేసీఆర్ మారారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికలో టీర్ఎస్ ప్రభుత్వాన్ని రోడ్డు రోలర్ లా తొక్కాలని పిలుపునిచ్చారు. మునుగోడు మొనగాడు రాజగోపాల్ రెడ్డి అని అన్ని అర్వింద్… ఉప ఎన్నికలో పాపాల భైరవుడు కేసీఆర్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఎంపీ అర్వింద్‌ పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version