బ్రేకింగ్‌ : ”మా” ఎన్నికల్లో రోజా మద్దతు వారికే !

మా అధ్యక్ష ఎన్నికలు రాజకీయ ఎలక్షన్లను తలపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మా బరిలో ఉన్న ప్యానెల్‌ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వరుసగా ప్రెస్‌ మీట్లు పెట్టి…పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు ప్యానెల్‌ సభ్యులు.

ఇక ఇప్పటికే మంచు విష్ణు మరియు ప్రకాష్‌ రాజ్‌ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయగా.. ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఈ నేపథ్యం లో మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

” మా మ్యానిఫెస్టో లు చూశాను, “మా” ఎవరు అభివృద్ది చేస్తారు. అనే విషయంపై నేను ఎవరిని భావిస్తానో… వారి ప్యానల్ కే నా మద్దతు ఉంటుంది. మా ఎన్నికలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి వివాదాల్లొకి నేను వెళ్ళను” అంటూ రోజా సెల్వమణి పేర్కొన్నారు. కాగా.. మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.