`కియా తరలింపు` వార్తలపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌.. సిగ్గుపడాలంటూ ట్విట్‌..!

-

కియ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనం ప్రచురితమైన సంగ‌తి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వ అధికారులతో… కియ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు కథనం సారాంశం. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో పారిశ్రామిక రాయితీలపై… ప్రభుత్వం పునరాలోచన చేయటమే తరలింపునకు కారణమంటూ కథనంలో పేర్కొన్నారు. దీంతో ఈ వార్త‌పై తీవ్ర దుమారం రేగుతోంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి కియా సంస్థ తరలిపోతోందని వస్తోన్న వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మీడియాలో వస్తోన్న వార్తలు అసత్యమని చెప్పారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్ ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోన్న రాయిటర్స్ ఇండియా సిగ్గుపడాలి అంటూ ట్విట్ చేశారు. వార్తల పేరుతో ఇటువంటి నిరాధార విషయాలను ప్రచారం చేస్తోన్న జర్నలిస్టులను చూసి షాక్ అవుతున్నాను’ అని మండిప‌డ్డారు. కాగా, దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్… ఆంధ్రప్రదేశ్‌… అనంతపురం జిల్లాలో ఏర్పాటై… గత డిసెంబర్ నుంచీ ఉత్పత్తి చేపట్టిన విషయం అందరికీ తెలుసు. అయితే ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కియా మోటార్స్ అంశం కుదిపేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news