ఏపీ మంత్రి ఫోన్ కొట్టేసారు…!

-

అవును మీరు చదివింది నిజమే… ఏపీ మంత్రి ఫోన్ కొట్టేసారు. అవును నిజమే… ఏపీ రవాణా శాఖా మంత్రి పెర్ని నానీ ఫోన్ కొట్టేసారు. సాధారణంగా మంత్రుల ఫోన్లు అంటే చాలా భద్రంగా ఉంటాయి. అదే విధంగా వాటికి రక్షణ కూడా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నిత్యం వాళ్ళను గమనిస్తూ ఉంటారు. వాళ్ళ వస్తువులకు కూడా భద్రత ఉంటుంది. అయినా సరే ఆయన ఫోన్ పోయింది.

సచివాలయంలో ఆయన ఆర్ధిక శాఖ సమీక్షకు హాజరయ్యారు. రెండో బ్లాక్, 4 బ్లాక్ లో ఆయన సమీక్షలకు అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఆయన భోజనం చేసారు. భోజనం చేసే సమయంలో తన సెల్ ఫోన్ ని ఆయన పక్కన పెట్టారు. పక్కన ఉన్న వారితో మాట్లాడిన మంత్రి నానీ ఆ తర్వాత తన ఫోన్ కోసం వెతుకున్నారు. అది కనపడలేదు…

వెంటనే భద్రతా అధికారులకు సమాచారం ఇచ్చారు మంత్రి. దానిపై ఆరా తీయగా ఆ ఫోన్ అప్పటికే రాష్ట్రం దాటేసినట్టు గుర్తించారు అధికారులు. ఫోన్ లొకేషన్ ఆధారంగా చూస్తే అది తెలంగాణాలోని నల్గొండ లో ఉన్నట్టు గుర్తించారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ లో మంత్రిగారి విలువైన సమాచారం ఉండటంతో ఆయన ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news