విమానంలో సాంకేతిక సమస్య…ఎమ్మెల్యే రోజాకు తప్పిన ముప్పు..

చిత్తూర్ జిల్లా నగరి ఎమ్మెల్యే.. వైసీపీ కీలక నేతకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదం ఏర్పడింది. దీంతో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగళూర్ కు తరలించారు. రాజమండ్రి నుంచి బయలు దేరిన విమానం షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.55 గంటలకు  తిరుపతిలో ల్యాండ్ కావాలి. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలెట్ తిరుపతిలో ల్యాండ్ చేయకుండా విమానాన్ని బెంగళూర్ కు తరలించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్లైట్ లో ఉన్న 70 మంది సురక్షితంగా ఉన్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సాధ్యం కాక గంట సమయం విమానం గాలిలోనే చక్కర్లు కొట్టింది.

కాగా ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఓపెన్ కాలేదు. పైలెట్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని తెలపింది రోజా.