ట్రబుల్ షూటర్ హరీష్ రావును ట్రబుల్స్ లో పడేశాం- జగ్గారెడ్డి.

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ.. తామే నైతికంగా విజయం సాధించామమని కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి అన్నారు. మా ఓట్లు మేము వేసుకోవడానికి కాంగ్రెస్ తరుపున అభ్యర్థిని నిలిపాం అన్నారు. మాకు ఉన్న 230 ఓట్లతో పాటు ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. అంటే మేం విజయం సాధించినట్లే కదా..అని జగ్గారెడ్డి అన్నారు. అదనంగా వచ్చిన ఓట్లు ఎవరి అనేది తమకు తెలియదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ హరీష్ ను ట్రబుల్స్ లో పడేశామని ఆయన అన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

కాగా స్థానిక ప్రతినిధులు తమకు ఎన్నో సమస్యలు చెప్పారని.. మాకు నిధులు లేవు.. కూర్చోవడానికి కుర్చీ లేదని చెప్పారని.. కానీ ఓట్లు వేయలేదని జగ్గారెడ్డి అన్నారు. పోరాటం చేయండి అని ఓట్లు వేయకుంటే ఏం చేస్తామని జగ్గా రెడ్డి అన్నారు. 230 ఓట్ల కన్నా ఒక్క ఓటు తక్కువగా వచ్చినా.. రాజీనామా చేస్తానన్న నామాటకు విలువ ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.