గన్ మెన్లకు వెనక్కి పంపిన ఎమ్మెల్యే..

-

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే  భూమా బ్రహ్మానందరెడ్డి జిల్లా పోలీసుల తీరుని వ్యతిరేకిస్తూ..తనకు గన్ మెన్లు అవసరం లేదంటూ వెనక్కి పంపారు. దీంతో గతంలో ఆళ్లగడ్డ ‘కార్డన్ సెర్చ్’ లో తెదేపా కార్యకర్తల్ని పోలీసులు వేధిస్తున్నారంటూ మూడు రోజుల క్రిత్రమే మంత్రి అఖిలప్రియ గన్‌మెన్లను వెనక్కిపంపారు. తాజాగా మద్దతు బ్రహ్మానందరెడ్డి ఆమెకు మద్దతుపలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3న అర్ధరాత్రి తర్వాత ఆళ్లగడ్డలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ.. పోలీసులు మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఈ వ్యవహారాన్ని కార్యకర్తలు మంత్రి దృష్టికి

తీసుకెళ్లగా.. స్థానిక పోలీసుల్ని ఆమె వివరణ కోరగా.. ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారని చెప్పారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ మంత్రి అఖిల ప్రియ తన  గన్‌మెన్‌లను వెనక్కు పంపారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదని తిరస్కరించారు. ఎలాంటి భద్రత లేకుండానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామ దర్శిని, జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. జిల్లా ఎస్పీకి కొంత మంది తన కార్యకర్తలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఆమె పోలీసులపై మండిపడ్డారు. అయితే ఈ రోజు బ్రహ్మానంద రెడ్డి సైతం ఈ నిర్ణయం తీసుకోవడంతో రాయలసీమ రాజకీయాల్లో మరింత హీటె పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news