అందుకే నన్ను టార్గెట్ చేశారు : ఎమ్మెల్యే సీతక్క

-

ప్రజాసేవ, డబ్బు సంచుల మధ్య యుద్ధం మొదలవుతుందని.. ప్రశ్నించే గొంతు నొక్కేందుకే కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఆమె మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మిడతల దండులాగా బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని.. తనను ఓడించడానికి డబ్బు సంచులతో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.

” కష్టం ఎక్కడున్నా సీతక్క అక్కడ ఉంటుంది. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నన్ను టార్గెట్ చేస్తున్నారు. సీతక్క బాగా పని చేస్తుందని అసెంబ్లీలో పొగుడుతున్నారు. ఇక్కడ కొచ్చి ఓడించమంటున్నారు. ములుగు ప్రజల ఆత్మగౌరవాన్ని డబ్బు సంచులతో ముడిపెడుతున్నారు. ప్రజలే నా కుటుంబం.. నియోజకవర్గం ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారు. బీఆర్ఎస్ నాయకులందరూ దండయాత్రలు చేసి ములుగును భయాందోళనకు గురి చేస్తున్నారు” అని సీతక్క నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు ఎమ్మెల్యే సీతక్క. బీఆర్ఎస్ మాయ మాటలు ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ములుగులో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీతక్క.

 

Read more RELATED
Recommended to you

Latest news