వివాదంలో MLA వాసుపల్లి.. కాలేజీ లో మద్యం, కోళ్లు పంపిణి..!

-

సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. కనుమ నాడు నాన్ వెజ్ మార్కెట్లకు డిమాండ్ అయితే ఫుల్ గా ఉంది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యకర్తలకి ఇచ్చిన కనుమ కానుక వివాదాస్పదంగా మారింది కళాశాలలో కార్యకర్తలకు మద్యం కోళ్లు పంపిణీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కి చెందిన డిఫెన్స్ అకాడమీలో కనుమ పండుగ సందర్భంగా మద్యం కోళ్లు పంపిణీ చేశారు ఈ కళాశాలని రామబణం క్యాంపస్ అని అంటారు.

డిఫెన్స్ ఉద్యోగాలకి వెళ్లేందుకు శిక్షణ తీసుకునే విద్యార్థులు కూర్చునే తరగతి గదుల్లో 400 మద్యం బాటిల్స్ అలానే బతికి ఉన్న కోళ్ళని పంపిణీ చేస్తున్న వైనం పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఇది కాస్త వివాదంగా మారిపోయింది. పంపిణీ కోసం ముందు రోజే టోకెన్లు పంపిణీ చేశారట. నాలుగు వందల మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయి. మద్యం పంపిణీ టైంలో కళాశాలపై అంతస్తులో ఉన్న కార్యాలయంలోనే ఎమ్మెల్యే గణేష్ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు లిక్కర్ కోళ్ల పంపిణీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version