సేవా కార్యక్ర‌మాల‌కు ఎప్పుడూ స‌హ‌క‌రిస్తా..!

-

సేవాకార్య‌క్ర‌మాల‌కు ఎప్పుడూ త‌న వంతు స‌హ‌కారం ఉంటుంద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని ప‌ట్ట‌ణంలోని బాపూజీ, ప్ర‌శాంతి వృద్ధాశ్ర‌మాల్లో ఉన్న వారికి శుక్ర‌వారం నుంచి ఈ నెల 24వ తేదీ వ‌రకు రెండు పూట‌లా అన్న‌దానాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ప‌ఠాన్ త‌ల్హాఖాన్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ క‌ష్టాల్లో ఉన్న‌వారికి సాయం చేయ‌డాన్ని బాధ్య‌త‌గా భావించాల‌ని చెప్పారు. దీనివ‌ల్ల స‌మాజానికి ఎంతో మేలు చేకూరుతుంద‌న్నారు. ఇప్ప‌టికీ ఆక‌లి చావులు దేశంలో న‌మోద‌వుతున్నాయ‌ని, ఇంత అవ‌గాహ‌న, చైత‌న్యం పెరిగాక కూడా, ఆర్థిక ప‌రిస్థితులు మెరుగ‌య్యాక కూడా ఇలాంటి చావులు మంచిది కాద‌ని చెప్పారు. అన్నం పెట్టి ఆదుకునేవారు దేవుళ్ల‌తో స‌మాన‌మ‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version