58 ఏళ్ల వయసులో ఏ మాత్రం సంకోచించకుండా పిల్లలతో కలిసి పదవ తరగతి పరీక్ష రాశారు బిజెడి ఎమ్మెల్యే అంగాడ కన్హార్. ఆయన హాజరైన పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గా ” కొందరు పంచాయతీ సభ్యులు, నా డ్రైవర్ నన్ను పరీక్షకు హాజరు కావడానికి ప్రోత్సహించారు.నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలనో లేదో నాకు తెలియదు కానీ నేను పదవ తరగతి పాస్ అవ్వడానికి నా పరీక్షను రాశాను” అని కన్హాన్ చెప్పారు.నిజానికి అంగాడ కన్హార్ 1978లోనే తన చదువు ఆపేశారు.కనీసం 10 వ తరగతి కూడా చదవ లేక పోయారు.ఆ తర్వాత రాజకీయాల్లో రాణించారు.
కానీ పదవ తరగతి పూర్తి చేయాలని ఆయన అనుకునేవారు.కాగా శుక్రవారం మొదలైన పదవ తరగతి పరీక్షలకు ఒడిషా రాష్ట్రంలో 5.71 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.3,540 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.ఈ పరీక్షలు మే 6 వ తేదీ వరకు జరుగుతాయి. మన సంకల్పం మంచిది అయినప్పుడు వయసు అర్హత అడ్డురావు.ఈ వయసులో ఎందుకులే అనుకుంటే అక్కడే ఆగిపోతారు.మన లక్ష్యం గొప్పది అయినప్పుడు వీటిని లెక్క చేయనక్కర్లేదు.ఇదే విషయాన్ని రుజువు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఎమ్మెల్యే.