ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

-

ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది.ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల తర్వాత క్యూలైన్లో ఉన్న వారు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరగ్గా.. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండనుంది.ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు.

 

3 జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉండగా మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహించారు. ఎన్నికల బరి లో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్ పేపర్ ,జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగించారు.3000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో వచ్చే నెల 5న ఓట్లను లెక్కించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news