దున్నపోతు అంటూ అచ్చెన్నాయుడు పై విరుచుకుపడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

-

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వరుస పదజాలంతో రెచ్చిపోయారు.” అరే దున్నపోతు నిన్ను తన్నాలి అంటే మాకు ఒక్క నిమిషం పట్టదు. ఈరోజు చెబుతున్నా.. ఆహుతి సినిమాలో విలన్ ను ఎలాగైతే ఈడ్చి ఈడ్చి కొట్టారో అలాగే నిన్ను కూడా ఈ టెక్కలి రోడ్లపై ఈడ్చి ఈడ్చి దొర్లించి కొట్టకపోతే ఐ యామ్ నాట్ దువ్వాడ శ్రీనివాస్ అని మీసాలు మెలేస్తూ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి గాని వైసీపీ నాయకుల గురించి గాని మాట్లాడితే తాట తీస్తాం అని హెచ్చరించారు.

అచ్చెన్నాయుడు నిన్ను రాజకీయంగా పతనం చేయడమే నా లక్ష్యం అంటూ తిట్టిపోశారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ కూడలిలో సోమవారం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీకి, దొంగల పార్టీకి గతిలేక నిన్ను అధ్యక్షుడిని చేశారు. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి పై మాట్లాడితే నీ తాట తీస్తా జాగ్రత్త అంటూ దువ్వాడ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news