నాలుగో రోజు కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు…సర్వత్రా ఉత్కంఠ

-

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగో రోజు కూడా కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక నల్గొండ – ఖమ్మం – వరంగల్ స్థానంలో ఇప్పటివరకు దాదాపు 67 మంది ఎలిమినేట్ అయినట్లు చెబుతున్నారు. లక్షా పాతిక వేల ఐదు వందల ముప్పై ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. రెండవ స్థానంలో తీన్మార్ మల్లన్న మూడో స్థానంలో ప్రొఫెసర్ కోదండరామ్ కొనసాగుతున్నారు.  మల్లన్నకు 91 858 ఓట్లు లభించాయి. ఈ ప్రొఫెసర్ కోదండరామ్ కి 79 110 ఓట్లు లభించాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

ఒక రకంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు మెజారిటీ తగ్గుతుంది అని చెబుతున్నారు. తీన్మార్ మల్లన్న కోదండరామ్ పోటాపోటీగా దూసుకొస్తున్నారు. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్  లెక్కింపులో కూడా సరైన క్లారిటీ రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లతో దాదాపు 85 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి 1016619 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రామచంద్ర రావు ఉన్నారు ఆయనకి 1006580 ఓట్లు లభించాయి, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ కు 50080 ఓట్లు లభించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version