మహిళా బిల్లుపై ఎందుకు ప్రశ్నించలేదు..? సోనియాకు కవిత సూటి ప్రశ్న

-

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆమె నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ముఖ్యమైన జాతీయ అంశం కాదా అని ప్రశ్నించారు కవిత. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సోనియాగాంధీ లేఖ రాశారు.

చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అంటూ ప్రశ్నించారు కవిత. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని విమర్శించారు ఆమె. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని నిరూపితమైందని కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version