జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న టీడీపీ నేత..

-

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. పార్టీలోని బలమైన క్యాడర్ అంతా వైసీపీలో చేరడంతో అధినేతకు ఏం చేయలో తెలియలేని పరస్థితి ఎదురవుతోంది. అనంతపురం జిల్లాలో మరో ముఖ్యమైన టీడీపీ నేత ఎమ్మెల్సీ శమంతకమణి ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామినీ బాల నేడు టీడీపీని వీడి వైెసీపీలో చేరనున్నారు. దీనిపై వారు ఇప్పటికే విజయవాడలోని  తమ అనుచరులు, కార్యకర్తలతో సమాశవేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది…

అదిష్టానం తీరుపై వీరిద్దరూ గత కొన్ని రోజులుగా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో కొత్త వారికి ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని వారు ఆగ్రహంగా ఉన్నారట. అందుకే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

శమంతకమణి కుమార్తె యామినీ బాల 2014 ఎన్నికల్లో అనంతపపురం జిల్లా శింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో అధిష్టానం ఆమెకు టికెట్ ఇవ్వకుండా బండారు శ్రావణికి ఇచ్చింది. ఆమె వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయారు. దీంతో ఇన్నాళ్ళూ పార్టీలో అసంతృప్తితో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news