టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీ సింహకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగా అమ్మాయి కోసం వెతుకుతున్న వీరికి తమ వ్యాపారాలలో భాగస్వాములుగా ఉన్న నటుడు మరియు వ్యాపారవేత్తగా ఉన్న మురళీమోహన్ మనుమరాలు రాగ ను చూసి ఇష్టపడ్డారట. ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు ఈ శుభకార్యం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఇరు కుటుంబాల నుండి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందట. కాగా శ్రీసింహ ఇప్పటికే హీరోగా మారి కెరీర్ లో భాగ్ సాలె, మత్తు వదలరా, ఉస్తాద్ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కానీ ఇంకా హీరో మెటీరియల్ గా ప్రూవ్ చేసే సినిమా రాలేదనే చెప్పాలి. ఇక అమ్మాయి రాగ ఇరు కుటుంబాలకు చెందిన కొన్ని వ్యాపార సంస్థలను చూసుకుంటూ ఉన్నారట.