ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

-

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సెషన్ లో దేశీయ మార్కెట్ లు అన్నీ కూడా నిరాశపరిచాయి. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి రిపోర్ట్ చూస్తే, సూచీలు భర్తీ పతనం అయినట్లు తెలుస్తోంది. ఇందులో సెన్సెక్స్ 825 పాయింట్లు కోల్పోయి 64571 కు చేరుకోగా, నిఫ్టీ మాత్రం 260 పాయింట్లు నష్టాన్ని చూసి 19281 వద్దకు చేరి స్థిరపడింది. ముఖ్యంగా నష్టపోయిన అంశాలలో మెటల్, ఐటీ, రియాల్టీ, విద్యుత్, ఇంధన రంగాలు 2 నుండి 3 శాతం నష్టాన్ని రుచి చూశాయి. ఇక ఆటతో, బ్యాంకు, FMCG, ఫార్మా రంగాల షేర్లు 1 నుండి 2 శాతం నష్టాలబాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ నష్టాలతో ముదుపర్లు అంతా షాక్ లో ఉన్నారు.

కాగా ఈ రోజు విజయదశమి కావడంతో బ్యాడ్ న్యూస్ వీరందరినీ చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పాలి. అందుకే స్టాక్ మార్కెట్ గురించి ఎవ్వరూ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని ఊహించలేరు. ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news