గుంటూరులో కరోనా కేసులు రోజు రోజుకి తీవ్రతమవుతున్న నేపధ్యంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీడీసీసీ బ్యాంక్ సహకారంతో మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసామని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ మీడియాకు వివరించారు. ప్రజలకు ఆర్ధిక ఇబ్బందుల నుంచి తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎక్కడ ఎక్కడ మొబైల్ ఏటీఎంలో ఉన్నాయి అంటే…
17న ఉదయం శ్రీనివాసరావుపేట, కొరిటెపాడులో 9 నుంచి 11.30 గంటల వరకు ఉంచుతారు. చైతన్యపురిలో 11.45 నుంచి 2 గంటల వరకు ఉంటుంది, 18న ఆనందపేటలో 9 నుంచి 11.30 గంటల వరకు, కుమ్మరబజార్లో 11.45 నుంచి 2 గంటల వరకు మొబైల్ ఏటీఎం అందుబాటులో ఉంచుతారు.
20న మంగళదాస్ నగర్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, శ్రీనివాసరావుపేటలో 11.45 నుంచి 2 గంటల వరకు, 21న కొరిటెపాడులో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, చైతన్యపురిలో 11.45 నుంచి 2 వరకు, 22న ఆనందపేటలో 9 నుంచి 11.30 వరకు, కుమ్మర బజారులో 11.45 నుంచి 2 గంటల వరకు మొబైల్ ఏటీఎం అందుబాటులో ఉంటుందని ఆమె వివరించారు.