హోటల్ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నారా…? ఈ విధంగా చేయండి మీకు తిరుగు ఉండదు…!

-

ఈ రోజుల్లో జనం ఎక్కువగా ఆహారం కోసం తమ వంట గదిని వదిలి బయట ఆహారం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వండుకోవడానికి సమయం లేక సరదాకి బయటకి వెళ్ళినప్పుడు, సినిమాలకు షికార్లకు వెళ్ళినప్పుడు ఇలా ఏదోక రూపంలో వారు బయటి ఆహారం తీసుకుంటున్నారు. కాస్త రుచిగా ఉంటే చాలు ఇక బెస్ట్ ఫుడ్ అంటూ అలవాటు పడిపోతున్నారు జనం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో జనం వండుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదని ఇటీవలి సర్వేలు కూడా చెప్పాయి.

దీనినే మనం మంచి వ్యాపారం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం మంచి మార్గం మొబైల్ ఫుడ్. జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మీరు దీనిని మొదలుపెడితే మంచి వృద్ది ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో నాణ్యత మీరు పాటిస్తే ఆ ప్రాంతలో ఉన్న ప్రజలు మీకు అలవాటు పడిపోతు ఉంటారు. మషాలా ఫుడ్ కంటే ఇప్పుడు ఎక్కువగా జనం లైట్ ఫుడ్ కి ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచిస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు షిఫ్ట్ ల వారీగా  బయటకు వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనికి ఎక్కువ అలవాటు పడుతున్నారు జనం.

కాబట్టి మీరు… ఆ సమయాలను తెలుసుకుని… అక్కడకు మన ఫుడ్ వాహనాన్ని తరలిస్తే ఎక్కువగా మన వద్దకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆ ప్రాంతంలో డెలివరి బాయ్ ని పెట్టుకుంటే… పలానా సమయానికి మీరు ఆర్డర్ కూడా ఇచ్చే సౌకర్యం ఉంటుంది. అపార్ట్మెంట్ లో ఉండే జనానికి సమయం ఉండటం లేదు కాబట్టి సాయంత్ర సమయంలో మీరు అక్కడ మీ వాహనాన్ని పెడితే మంచి గిరాకి ఉంటుందని అంటున్నారు. కాలేజీల వద్ద కూడా యువతను మీరు ఆకట్టుకునే విధంగా ఆహారం అందించగలిగితే… మొబైల్ ఫుడ్ అనేది విజయవంతంగా నడపవచ్చని ఆ రంగంలో అనుభవం ఉన్న వారు చెప్తున్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news