భాజపాను ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న మహాకూటమి, ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలు విఫలయత్నాలుగా తేల్చిచెప్పారు. సిద్ధాంత పరమైన వైరుధ్యాలున్న పార్టీలు ఒక్కటిగా కలిసి మోదీ ఓటమే అజెండాగా ఏకమవడాన్ని ప్రజలు తిప్పికొడతారని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ – తెదేపా పోత్తుని స్థానిక ప్రజలను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఇందులో ముఖ్యంగా కూటమి ఏర్పాటుకు చొరవ చూపిన ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు.
ఇక్కడ నుంచే కూటమికి తొలి ఓటమి ప్రారంభమైందన్నారు. నాటి సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరారని మండిపడ్డారు. మోదీ ఆశీస్సులతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.