డిప్యూటి చైర్మన్ కు మోడీ ఫిదా

రాజ్యసభలో రెండు రోజులుగా వాతావరణం వేడెక్కింది. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. రాజ్యసభ ఎంపీలు కొందరు డిప్యూటి చైర్మన్ ని ఇబ్బంది పెట్టారు. వారిని నిన్న సభ నుంచి సస్పెండ్ చేసారు. వారు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేస్తుంటే డిప్యూటి చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ వారికి వెళ్లి టీ ఇచ్చారు.

ఈ వీడియో వైరల్ అయింది. కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేసి, అవమానించిన వారికి వ్యక్తిగతంగా టీ వడ్డించడం, ధర్నాపై కూర్చున్న వారి ద్వారా… శ్రీ హరివంష్ జీ వినయపూర్వకమైన మనస్సుతో, పెద్ద హృదయంతో ఆశీర్వదించబడ్డారని తెలుస్తుంది. ఇది అతని గొప్పతనాన్ని చూపిస్తుంది. భారత ప్రజల తరుపున నేను ఆయన్ను అభిమానిస్తున్నాను అని ప్రదాని నరేంద్ర మోడీ ట్విట్ చేసారు.