గత శనివారం తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చాడు ధోనీ. కెప్టెన్ గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కి అందించి ధోనీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో తొలిసారి టీమిండియాని నెం 1 గా నిలిపాడు. ఆయన రిటైర్మెంట్ ప్రక్తించాగానే క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు ధోనీకి తమదైన శైలిలో వీడ్కోలు తెలిపారు.
తాజాగా ఆయన్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ లేఖ రాశారు. ఓ రెండు పేజీల సుదీర్ఘ లేఖని ఆయన ధోనీకి పంపారు. అందులో ధోనీ అంటే కేవలం నెంబర్లు, రికార్డ్ గుర్తించుకోవడం కాదని అన్నారు. అలానే మరిన్ని విషయాల్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇక మోడీ లేఖపై మహేంద్రసింగ్ ధోనీ స్పందించాడు. ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలేనని ధోనీ చెప్పుకొచ్చాడు ధోనీ. అలానే తనకు లేఖ రాసిన మోడీకి థ్యాంక్స్ కూడా చెప్పాడు.
An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. pic.twitter.com/T0naCT7mO7
— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020