హైదరాబాద్ టూర్ : కేసీఆర్ కు షాకిచ్చిన మోడీ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేసీఆర్ కు షాకిచ్చారు. నిజానికి సహజంగా ప్రధాన మంత్రి ఏ రాష్ట్ర పర్యటనకు వచ్చినా అక్కడి విమానాశ్రయం వద్ద రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఈ సారి కూడా అలాగే చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఈరోజు మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి వచ్చే ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చారు. అయితే దీనికి స్పందనగా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది.

ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి వ్యక్తిగత సహాయకుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారని అంటున్నారు. ప్రధానమంత్రి స్వాగతం చెప్పడానికి కేవలం ఐదుగురికి మాత్రమే పిఎంవో అవకాశం ఇచ్చింది. హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సిపి. సజ్జనార్ లు మాత్రమే హకీంపేట విమానాశ్రయానికి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది. అయితే ఇది ఆకస్మిక పర్యటన కావడంతో ఇలా పెర్కొన్నారా ? లేక గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో కలిస్తే ఏమైనా సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని భావించి ఇలా చేశారా ? అనేది తెలియాల్సి ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news