ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల విషయమై మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా… విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను వర్తించేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేవలం కులం ఆధారంగా కాకుండా, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలన్న ఆరెస్సెస్ సూచనతోనే కేంద్రంలోని భాజపా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన బిల్లుని రాజ్యాంగ సవరణ చేసి … ఆ బిల్లును ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న ఎవరైనా విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో ప్రవేశం కోసం పది శాతం రిజర్వేషన్ పొందే వీలుంటుంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రవర్ణాల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.