రేపు, ఎల్లుండి దేశవ్యాప్తంగా బ్యాంకులకు తాళాలు!..

-

రేపు, ఎల్లుండి కార్మిక సంఘాల పిలుపు మేరకు జరగనున్న భారత్ బంద్ లో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో  ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్ జనవరి 8-9న సమ్మెలో పాల్గొననుంది. ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 సవరణ ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐటీయు జాతీయ కార్యదర్శి తపన్ సేన్ గుప్తా ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8-9న భారత్ బంద్ నకు పిలుపునిచ్చాయన్నారు. ట్రేడ్ యూనియన్లు తమ 12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

ఆలిండియా కిసాన్ మహాసభ కూడా ట్రేడ్ యూనియన్ల దేశవ్యాప్త బంద్ ను స్వాగతించింది. ఈ సమ్మెలో భాగంగా భారత్ బంద్, రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపట్టనున్నారు. పబ్లిక్ సెక్టార్, చిన్న పరిశ్రమలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, నౌకాశ్రయాలలో పని చేసేవారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ఉద్యోగులు కూడా ఈ భారత్ బంద్ లో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news