పిఓకేను ఇండియాలో కలపడానికి మోడీ యాక్షన్ ప్లాన్

-

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఇండియాలో కలపడానికి ప్రధాని మోడీ యాక్షన్ ప్లాన్ రచించాడని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మోదీకి సరితూగే వ్యక్తి ఈ దేశంలో లేడని, అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాడని ప్రశంసల వర్షం కురిపించారు.

లాల్ చౌక్ లో రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా చేశారని అన్నారు. కాశ్మీర్ లో పర్యాటకుల సందడి నెలకొనడానికి మోడీయే కారణమని తెలిపారు.గ్యారెంటీలు, ఉచితాల పేరుతో డబ్బులను వృథా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదహారు వేల కోట్లు అప్పు తెచ్చాడని ఆరోపించారు. ఢిల్లీకి 2 వేల కోట్ల రూపాయల కప్పం కట్టాడని తెలిపారు. కాళేశ్వరం , విద్యుత్ అవినీతి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news