మోదీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌… ఏపీ నుంచి కేంద్ర మంత్రి ఎవ‌రంటే…

-

మోడీ వందరోజుల పాలన పూర్తయ్యింది. రెండోసారి ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక మోడీ దూకుడుకు బ్రేకులు లేవు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నుంచి చెప్పుకుంటూ పోతే చాలా విష‌యాల్లో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఇప్ప‌టికే మోదీకి త‌న కేబినెట్‌పై పూర్తిగా ప‌ట్టు వ‌చ్చేసింది… కేబినెట్లో ఎవ‌రి వ‌ల్ల ఉప‌యోగం ఉందో ?  ఎవ‌రు ప‌ని చేస్తున్నారో ?  ఎవ‌రు ప‌ని చేయ‌డం లేదో ?  క్లారిటీ వ‌చ్చేసింది. ఇక కొంద‌రు మంత్రుల‌కు ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న మంత్రులకు అవి భారమవుతున్నాయని తేలింది.

ఇక సెప్టెంబ‌ర్ చివ‌ర్లోనే మోడీ కేబినెట్‌ను విస్త‌రించాల‌నుకుంన్న‌ట్టు ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే త‌న కేబినెట్ లో ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న సృతీఈరానీ – నరేంద్రసింగ్ తోమర్ – రవిశంకర్ ప్రసాద్ – హర్షవర్ధన్ – ప్రకాష్ జవదేకర్ – పీయూష్ గోయల్ – ధర్మేంద్ర ప్రధాన్ – ప్రహ్లాద్ జోషి ల వద్దున్న ఎక్కువ శాఖలను కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకొని వారికి అప్పగించాలని యోచిస్తున్నారట.

ఇక ఇప్పుడు కేంద్ర కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ‌రికి చోటు ద‌క్క‌నుంది ? అన్న‌ది స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతోంది. తెలంగాణ‌లో ఆ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నేత‌లే ఊహించ‌ని విధంగా ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు ద‌క్కించుకుంది. తొలి విడ‌త‌లోనే కిష‌న్‌రెడ్డికి కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇక తెలంగాణ నుంచి రేసులో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్‌రావు ఉన్నారు.

ముర‌ళీధ‌ర్‌రావు కేసీఆర్ సామాజిక‌వ‌ర్గానికే చెందిన వారు. ఆయ‌న‌పై మోదీకి గురి ఉంది. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే ఎవరికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఆ రాష్ట్రం కోటాలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తెలుగు వ్యక్తి రాంమాధవ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని మోడీ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఆయ‌న ఏపీలోనే కాకుండా బీజేపీ త‌ర‌పున ఇత‌ర రాష్ట్రాల్లో కూడా పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న్ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుని కీల‌క శాఖ క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news