మన్ కీ బాత్ లో మోదీ కీలక నిర్ణయం..ప్రొఫైల్ ఫోటో మార్చాలని పిలుపు..

-

భారత ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.. ఒక్కో ప్రత్యెకమైన రోజు ఒక్కో ప్రత్యేకత కలిగి ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు..ఈ మేరకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలో అంతా పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతిఒక్కరూ తమ సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్‌ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు..ఈసారి ప్రధాని మోదీ స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం గురించి మాట్లాడారు. ఈసారి ‘మన్ కీ బాత్’ చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఈసారి స్వాతంత్ర్య దినోత్సవమే ఇందుకు కారణం…

ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా మూడు రంగుల జెండాను ఎగురవేయాలని ప్రధాని మోదీ కోరారు. ఫలితంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు…అలాగే స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రత్యేక ఉద్యమం ‘హర్ ఘర్ తిరంగ’ నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమంలో భాగం కావడం ద్వారా ఆగస్టు 13 నుండి 15 వరకు మీరు తప్పనిసరిగా మీ ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి లేదా మీ ఇంటి వద్ద పెట్టుకోవాలి..మంగళ వారం నుంచి భారతీయ జెండాను త్రివర్ణ పతాకాన్ని సోషల్ మీడియా ప్రొఫైల్ గా తప్పక పెట్టుకోవాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమం లో భాగంగా మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారి జయంతి ఆగస్టు 2. ఆయనకు గౌరవప్రదమైన నివాళులు అర్పించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం, భారతీయ ఔషధాల పట్ల ఆకర్షణ పెరుగుతోంది. ఇటీవల, గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్ సమ్మిట్ జరిగింది. ఇందులో దాదాపు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇండియన్ వర్చువల్ హెర్బేరియం జూలై నెలలో ప్రారంభించబడిందని అన్నారు..ప్రతి ఒక్క రంగంలో మన దేశం ఇతర దేశాలతో పోటీ పడుతుందని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news