పవన్‌ కళ్యాణ్‌ పై మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు… వేదికలపై ఏది పడితే అది మాట్లాడొద్దు !

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల వాడి ఏ మాత్రం తగ్గడం లేదు. మా అసోషియేషన్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా డైలాగ్‌ కింగ్‌ మోహన్ బాబు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. దేవుడి నిర్ణయం మేరకు జరిగింది… మా అసోషియేషన్‌ ఎన్నికల విజయం అందరిదన్నారు. తనను మొదటి నుంచి రెచ్చ గొట్టాలని చూస్తున్నారని…తానేమీ అసమర్థున్ని కాదని పేర్కొన్నారు మోహన్‌ బాబు. సింహం నాలుగు అడుగులు వెనుకకు వేస్తే… వెనుకడుగు వేసినట్టు కాదన్నారు.

మనకు టైం వచ్చినప్పుడే సమాధానం చెప్పాలని తెలిపారు. అన్ని నవ్వుతూ స్వీకరించాలని… నోరు వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని వివాదస్పద వ్యాక్యలు చేశారు మోహన్‌ బాబు. వరల్డ్ వైడ్ గా మా ఎన్నికల గురించి మాట్లాడుకున్నారన్నారు. సీఎంల ను కలిసి విజ్ఞప్తి చేస్తేనే వారు స్పందిస్తారని… సీఎం కేసీఆర్‌ ను మనం సన్మానించామా? అని మోహన్‌ బాబు ప్రశ్నించారు. ఇద్దరు సీఎం ల సహకారం ‘మా’ కు కావాలని… వేదికలపై ఏది పడితే అది మాట్లాడొద్దని పేర్కొన్నారు మోహన్‌ బాబు. అయితే.. మోహన్‌ బాబు చేసిన.. ఈ వ్యాఖ్యలు పవన్‌ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినవేనని అందరూ చెవులు కొరుకుంటున్నారు. కాగా.. రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సమయంలో పవన్‌ కళ్యాణ్‌.. జగన్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే.