చంద్రబాబుకి వ్యతిరేకంగా మోహన్ బాబు ధర్నా.. బాబుపై సంచలన వ్యాఖ్యలు..!

-

సిని నటుడు, నిర్మాత కలక్షన్ కింగ్ మోహన్ బాబు తిరుపతిలో శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్థను నడిపిస్తున్నారని తెలిసిందే. కొన్నాళ్లుగా విద్యార్ధులకు సేవలందిస్తున్న శ్రీవిద్యా నికేతన్ కు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని అన్నారు మోహన్ బాబు. తన విద్యార్ధులకు రావాల్సిన ఫీజ్ రియంబ్రెస్ మెంట్ రాకుండా చేస్తున్నాడని అన్నారు. బాబుకి వ్యతిరేకంగా తిరుపతి మదనపల్లి రోడ్ లో విద్యార్ధులతో కలిసి ధర్నా చేశారు మోహన్ బాబు.

చంద్రబాబు అంటే తనకు ఇష్టమే కాని ఇలాంటి చర్యలు తగవని అన్నారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు తన విద్యార్ధులతో కలిసి ఆయనకు పోరాడామని.. ఓటు వేసి గెలిపించిన ప్రజలను నాలుగేళ్లుగా ఆయన ఏడిపిస్తున్నాడని అన్నారు మోహన్ బాబు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు.. ఆదు దూడ పథకం కింద గోవులను ఇస్తున్నాడు. విద్యార్ధులకు మాత్రం ఫీజు రీ యంబర్స్ మెంట్ ఇవ్వలేకపోతున్నాడు. ఏదైనా అంటే మాత్రం అమరావతి కడుతున్నా అంటున్నాడని అన్నారు మోహన్ బాబు. ప్రజల దగ్గర దోచుకున్న డబ్బునే మళ్లీ వాళ్లకు ఇస్తున్నారని అన్నారు.



చంద్రబాబు అహంకారం పరాకాష్టకు చేరిందని.. అహంకారం నిండిన వ్యక్తుల జీవితాలు ఎలా ముగిశాయో తెలుసని.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల జీవితాల్లో సువర్ణాక్షరాలతో రాసేలా ఉండాలని అలా రాయడానికి నువ్వేమి హరిశ్చంద్రుడు, ధర్మరాజువి కాదని అవన్ని నాకు అవసరం లేదు నా పిల్లలకు రావాల్సిన డబ్బు ఇప్పిస్తే చాలని అన్నారు. మోహన్ బాబు ధర్నాలో ఆయన కూతురు మంచు లక్ష్మి, చిన్న కొడుకు మనోజ్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news