ఎన్ని సినిమాలు చేసినా ఆ కోరిక తీరలేదు..!

-

మణిరత్నం సినిమాలో హీరోయిన్ అనగానే అందరికి మదిలో మెదిలే రూపం మధుబాల.. రోజా, జెంటిల్ మెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మధుబాల చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసిన మధుబాల ఒక్క అవార్డ్ మాత్రం రాబట్టలేకపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మధుబాల 2008లో బాలీవుడ్ లో కభీ సోచా భీ నా థా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

2013లో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన మధుబాల ప్రస్తుతం తమిళ సినిమా అగ్నిదేవిలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను ఎన్నో సినిమాలు చేసినా అవార్డులు మాత్రం రాలేదని అవార్డ్ వచ్చేదాకా సినిమాలు చేస్తానని.. ఈ సినిమాలో తను పొలిటిషియన్ పాత్రలో నటిస్తున్నానని.. నిజ జీవితానికి దూరంగా ఈ సినిమాలో తన పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు మధుబాల. మరి ఈ సినిమాతో అయినా మధుబాల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news