బెదిరింపులకు ఎవరూ భయపడరు : మోహన్ బాబు

ఈరోజు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సహా పలువురు నటీనటులు అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కంటే టాలీవుడ్ లోనే పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయని మోహన్ బాబు అన్నారు. మనం కళాకారుల గురించి మాట్లాడాలని రాజకీయాల గురించి కాదని అన్నారు. నువ్వు గొప్ప నేను గొప్ప అనేది ముఖ్యం కాదని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

టాలెంట్ ఎవరి సొత్తు కాదని మోహన్ బాబు చెప్పారు. బెదిరింపులకు కళాకారులు ఎవరు భయపడరు అని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు గెలుపుకు నరేష్ ఎంతో కృషి చేశాడని అన్నారు. నరేష్ విష్ణు పక్కనే ఉండి సలహాలు ఇస్తూ ఎంతో సహాయ పడ్డారు అని… ఆయనను ఎప్పుడు మర్చిపోను అని అన్నారు. విష్ణు ఎన్నో వాగ్దానాలు చేశాడు అని అవన్నీ ఎలా నెరవేరుస్తాడో అని భయపడుతున్నానని చెప్పారు