విష్ణు గెలుపులో నరేష్ ఎంతో కీలకమని.. తాను నరేష్ కు ఏం చేయలేదు…కానీ అన్న నేను ఉన్నాను అని నరేష్ అన్నాడని కొనియాడారు. నరేష్ చేసిన సేవలను తాను మారిచిపోనని చెప్పారు మోహన్ బాబు. మా సభ్యుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. కలసి మెలిసి ఉందామని.. ముందు కేసీఆర్ ను కలవాలని పేర్కొన్నారు.
కేసీఆర్ కళాకారులకు సాయం చేస్తారు…ఇచ్చిన మాట కేసీఆర్ తప్పరని వెల్లడించారు. తాను కేసీఆర్ ను కలసి పేద కళాకారులను సాయం చేయాలని అడుగుతానని స్పష్టం చేశారు. విష్ణు మీ సహాయ సహకారాలు కోరతాడు…కలసి మెలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మా పదవి చిన్న ఉద్యోగం కాదని.. సమస్య ఉంటే …మా అధ్యక్షుడికి చెప్పండి… టివిలకు ఎక్కవద్దని సూచించారు.
చిత్రపురి కాలనీ కోసం ఎంతో చేసానని.. కలసి కట్టుగా సాధిద్దామన్నారు. “నాకు పగ…రాగా ద్వేషాలు లేవు…నా కోపం నాకే నష్టం కలిగించింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి…మనము కళాకారుల గురించే మాట్లాడాలి…రాజకీయ నాయకులు గురించి కాదు” అని మోహన్ బాబు పేర్కొన్నారు.