హైదరాబాదులో మరికొద్ది గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరానికి ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. అంతేకాకుండా ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉరుములు.. మెరుపులతో భారీ వర్షం పడుతున్నట్లు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఈ రోజు రేపు తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఎల్లుండి మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇప్పటికే రాష్ట్రం లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.