అప్పు వసూలుకు వచ్చి.. ఓనర్ కూతురుతో లేచిపోయిన ఫైనాన్స్ ఏజెంట్ !

-

మధ్య కాలంలో ప్రేమ వివాహాలు చాలానే జరుగుతున్నాయి. కొన్ని ప్రేమ బంధాలు పెళ్లి వరకు వెళుతుంటే… మరి కొన్ని బంధాలు విడిపోతున్నాయి. కొంతమంది.. ఒకసారి చూసే అమ్మాయి ప్రేమలో పడుతున్నారు. అలాగే.. ఇంట్లో చెప్పకుండానే జంప్ అవుతున్నారు. ఇలాంటి ఘటనే బీహార్లోని హజారీబాగ్ లో  చోటు చేసుకుంది. ఫైనాన్స్ డబ్బుల కోసం వచ్చి ఏకంగా ఇంటి ఓనర్ కూతుర్ని లేపు కెళ్లాడు ఓ ఫైనాన్స్ ఏజెంట్.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… హజారీబాగ్ లో  ఆ యువతి కుటుంబం గత పది సంవత్సరాల నుంచి అద్దెకు ఉంటున్నారు. అయితే ఇల్లు కట్టుకునేందుకు ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో… ఆ యువతి తల్లి కొన్ని డబ్బులు అప్పు గా తీసుకుంది. అయితే ఆ డబ్బులను నెలనెలా ఆ కంపెనీకి చెందిన ఏజెంట్.. ఆ మహిళ ఇంటికి వెళ్లి తీసుకునేవాడు.

ఈ నేపథ్యంలోనే.. లోన్ తీసుకున్న ఆ మహిళ కూతురిని ప్రేమించాడు ఫైనాన్స్ ఏజెంట్. గాఢంగా ప్రేమించుకున్న వారిద్దరూ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.  హజారీబాగ్ నుంచి వెళ్ళిపోయిన ఈ జంట పాట్నా లో అద్దెకు ఉన్నారు. ఇక అటు  ఆ యువతి తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ జంట అద్దెకు ఉంటున్న కాలనీ లో.. కొంత మంది పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ఈ జంటను అదుపులోకి తీసుకొని.. పోలీసులు విచారించారు.

తమ పెళ్లికి.. ఆ అమ్మాయి వారి కుటుంబ సభ్యులు అడ్డు పడుతున్నారని.. దాని కారణంగానే తాను ఇంటి నుంచి పారిపోవలసి వచ్చిందని ఆ ఫైనాన్స్ ఏజెంట్ పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించారు. ఇరువురి కుటుంబాలతో మాట్లాడి… మీ వివాహం చేస్తామని చేస్తామని ఆ జంటకు భరోసా కల్పించారు. తాము ఇద్దరం మేజర్లమని.. తమ పెళ్ళిని ఎవరు అపలేరని ఈ జంట చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news