తెలంగాణ ప్రజలకు తెలంగాణ సర్కారు చేదు వార్తను చెప్పబోతోందా.. ప్రయాణికులపై మరింత భారం మోపబోతోందా.. టీఎస్ ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచబోతుందా.. అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో ప్రజలపై ఛార్జీల భారం మోపనుంది. పెరుగుతున్న డిజిల్ భారాన్ని తగ్గించుకోవాలంటే ఛార్జీల పెంపే ఏకైక మార్గమని టీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. రానున్న కేబినెట్ సమావేశంలో ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దాదాపు కిలోమీటర్ కు 15 పైసల నుంచి 30 పైసల దాకా ఛార్జీలు పెరుగనున్నాయని తెలుస్తోంది. దీంతో ప్రజలపై దాదాపు రూ. 1000 కోట్ల భారం పడుతుందని అంచానా.
ఇప్పటికే నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని బయటపడేయాటంటే ఛార్జీల పెంపే మార్గమని ఆర్టీసీ భావిస్తోంది. చాలా కాలం నుంచి టికెట్ ఛార్జీల పెంపుపై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా టికెట్ ఛార్జీలను త్వరలో ఆర్టీసీ పెంచబోతుందని తెలుస్తోంది. దీంతో సాధారణ, మధ్య తరగతి, పేద ప్రజలు ఆర్టీసీలో ప్రయాణం మరింత ప్రియం కానుంది.