ఈరోజుల్లో ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియకుండా పోతుంది. నేరస్థులు తన నేరశైలినే వృత్తిలో భాగం చేసుకుంటున్నారు. తాము చేసే పనిలోనే కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా.. తాజాగా ఓ ప్లంబర్ చేసిన పనిచూస్తే ఇక పై మీ ఇంటి మరమ్మత్తులకు ప్లంబర్ ని పిలవాలంటే కచ్చితంగా భయపడతారు. ఈఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
నేరాలు చేసే వాళ్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తుంటారు. కొందరైతే తమకు వచ్చిన పనుల ద్వారా నేరాలు చేయడం ఎలా అనే అంశంపై దృష్టి పెడుతుంటారు. తనకు వచ్చిన పనిని వినియోగించుకుని నేరానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అయితే అతడు మామూలోడు కాదని.. అతడి ఇంట్లో సోదాలు చేసిన తరువాత పోలీసులకు అర్థమైంది. ఇదంతా ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి రావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
బ్రిటన్‌లో నాటింగ్‌హామ్‌కు చెందిన 57 ఏళ్ల జేమ్స్ హుల్మ్ ఇటీవల తన బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా సీసీ కామెరా ఉండటం గమనించింది.. దెబ్బకి షాకై అసలు కెమెరా పెట్టే అవసరం ఎవరకి ఉందా అని బాగా ఆలోచించింది. అయినా తనకు ఎవరిమీద అనుమానం రాలేదు..తిన్నగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇంటిని పరిశీలించిన పోలీసులు.. ఇలా ఎవరు చేసి ఉంటారని విచారణ చేపట్టారు. ఆమెకు ఎవరిపైనైనా అనుమానం ఉందా అని అడిగితే.. తనకు ఎవరిపైనా అనుమానం లేదని సమాధానం ఇచ్చింది. అప్పుడే ఆమెకు ఓ విషయం గుర్తొచ్చింది.
మూడేళ్ల క్రితం తన బాత్‌రూమ్‌లో రిపేర్ చేయడానికి ప్లంబర్‌ను పిలిపించానని ఆమె వారికి చెప్పింది. అంతే పోలీసులకు విషయం అర్థమైంది. వారి దృష్టి ఆ ప్లంబర్‌పై పడింది. అతడిపై నిఘా పెట్టిన పోలీసులు.. అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్లంబర్ ఇంట్లోని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలా అతడి ల్యాప్‌టాప్ చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అందులో వందలకొద్దీ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫోటోలు కనిపించాయి.
తమదైన శైలిలో విచారించిన పోలీసులు మరింత సమాచారం రాబట్టారు. ఇలా ఎక్కడెక్కడ ఇంట్లో పని చేయడానికి వెళ్లి స్పై కెమెరాలు పెట్టాడని ఆరా తీశారు. అలా అతడిచ్చిన సమాధానంతో ఆ ఇళ్లను సందర్శించి వాటిని తొలగించారు. ప్రస్తుతం అతడు పని చేసిన మరికొన్ని ఇళ్లలోనూ ఇలాంటి కెమెరాలు ఉన్నాయేమో అనే వెతుకుతున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు తనకు ఒక సంవత్సరం మాత్రమే జైలు శిక్ష విధించింది.
మీరు ఇకపై బాత్రూమ్ లో ఏవైనా మరమ్మత్తులు చేయలని ప్లంబర్ ని పిలిస్తే వారిపై నిఘా ఉంచటం ఉత్తమం.. ఎంతో చిన్న చిన్న కెమేరాలను బిగిస్తారు. మనం ఊహించలేం కూడా..నష్టం జరిగాక బాధపడాల్సిందే.
– Triveni Buskarowthu