కేంద్రం రైతులకి తీపి కబురు చెప్పింది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటి వలన రైతులకి ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఈ స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) కూడా ఒకటి అనే చెప్పాలి. దీని వలన ఎందరో రైతులకి చక్కటి బెనిఫిట్స్ కలుగుతున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…
ఈ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చి 30 నెలలు అయ్యింది. కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6000 అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల్లో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయన్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు అన్న దాతలకు 8 విడతల డబ్బును ప్రభుత్వం అందించింది. గత నెలలో ఈ 8 విడత డబ్బుని అందించింది ప్రభుత్వం. ఇక 9వ విడత డబ్బులు అందించేందుకు సిద్ధమౌతోంది. రైతులకు 9వ విడత డబ్బులు ఆగస్ట్ నెల నుంచి రావొచ్చు.
ఇప్పటికి కూడా ఎవరైనా రైతులు ఈ పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) లో చేరక పోయి ఉంటే మీరు ఈ పథకంలో చేరొచ్చు. దీని కోసం మీ వద్ద బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్, పొలం పట్టా తప్పక ఉండాలి గమనించండి.
ఇప్పటికే అనేక మంది రైతులు కిసాన్ స్కీమ్‌లో చేరారు. మోదీ ప్రభుత్వం అందించే రూ.6,000 పొందుతున్నారు. పీఎం కిసాన్ స్కీమ్‌లో ఇంకా చేరలేని రైతులు ఇప్పుడైనా చేరండి. పీఎం కిసాన్ స్కీమ్‌లో రిజిస్టర్ ఎలా చేసుకోవాలి.