తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం నేతన్న కు చేయుత అనే పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని పునః ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే నమోదు చేసుకున్నవారు..కొత్తగా పథకంలో చేరిన నేతన్నల అకౌంట్లలోకి డబ్బులను జమచేయనుంది.
ఈ సారి మొత్తం 35వేల మందికి ఈ పథకం ద్వారా డబ్బులు అందిచాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కుంటుంబంలో 50శాతం నేత పని ద్వారా ఆదాయం పొందుతున్న కుటుంబాలకు ఈ పథకం ద్వారా డబ్బులు ఇవ్వనున్నారు. రూ.368 కోట్లతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.