భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వరద పంపు బాధితుల పునరావాసానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన పదివేల రూపాయల పరిహారం ఇంతవరకు అందలేదని మండిపడ్డారు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా వైరా లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి డిల్లీ లొ, మంత్రులు ఇళ్లల్లో, అధికారులకు ఆదేశాలు ఇచ్చే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.గోదావరి వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతులు 70% వ్యవసాయ పెట్టుబడులు పెట్టి ఆర్ధికంగా నష్టపోయారని, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలతో పాటు ఎరువులు ఉచితంగా ఇవ్వాలన్నారు బట్టి.వరద బాధితులకు ఇస్తానన్న పదివేల రూపాయలు నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదన్నారు.