రేపటి నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు … 21 బిల్లులు ప్రవేశపెడుతున్న మోదీ !

-

ప్రస్తుతం ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో పార్లమెంటరీ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన లోక్ సభ ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. కాగా రేపటి నుండి వర్షాకాల పార్లిమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ సమావేశాలలో మోదీ ప్రభుత్వం ఎంతో ప్లాన్ గా అలోచించి కొన్ని కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఇందులో ముఖ్యంగా ప్రజలందరి ఆసక్తిగా ఎదురుచూస్తున్నది రెండు బిల్లుల మీదనే అని ఖచ్చితంగా చెప్పాలి. అందులో ఒకటి ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు కాగా, మరొకటి ఉమ్మడి పౌర స్మృతి (UCC) బిల్లు పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ రెండు బిల్లులను దాదాపుగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ అడ్డుకునే అవకాశం ఉంది. ఇంకా సభలో చర్చించదగిన విషయాలలో మణిపూర్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు మరియు దేశ వ్యాప్తంగా విచ్చలవిడిగా పెరిగిపోయిన ధరల విషయంపై చర్చించనున్నారు.

మరి మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న 21 బిల్లులలో ఎన్ని బిల్లులు పాస్ అవుతాయి అన్నది తెలియాలంటే ఈ సమావేశాలు పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది.

Read more RELATED
Recommended to you

Latest news