నగర వాసులకు తాగు నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద పోటెత్తుతోంది. వరదనీరు భారీగా చేరుకోవడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి 6, హిమాయత్ సాగర్ నుంచి 1 గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మూసీకి వరద ఉధృతి కొనసాగుతున్న తరుణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరద ఇలాగే కొనసాగితే పరివాహక ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉందని హెచ్చరికలు పంపారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, మూడు రోజుల కిందట ఉస్మాన్ సాగర్‌కు వరద పోటెత్తింది.ఎఫ్టీఎల్ స్థాయికి నీరు చేరడంతో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.