ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. పేద మధ్య తరగతి ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకుంది. పథకంలో చికిత్సల సంఖ్యను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి 2007లో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆయన మరణంతో తర్వాతి ప్రభుత్వాలు పథకాన్ని నిర్వీర్యం చేశాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేస్తూ అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా పథకం పరిధిని గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తరించింది. అయితే అక్కడితో ఆగకుండా పథకం పై నిరంతరం సమీక్ష జరుపుతూ అవసరమైతే కొన్ని చికిత్సలు చేర్చాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద 2446 చికిత్సలు చేస్తున్నారు. అయితే తాజాగా మరో 700 చికిత్సలను ఈ పథకంలో చేర్చడానికి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.