అనకాపల్లి బ్రాండ్రిక్స్ సీడ్స్ యూనిట్ లో 121 మంది అస్వస్థతకు గురయ్యారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రెండు నెలల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది..అస్వస్థతకు గురైన వారిని 5 హాస్పిటల్స్ లో జాయిన్ చేశామని తెలిపారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు..ఎవరికి ప్రాణాపాయం లేదు.. జరిగిన సంఘటన దురదృష్టమన్నారు.
గత ప్రమాదంపై కమిటీ వేశాము..కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వచ్చింది..ఇంకా విచారణ జరుగుతుంది..గత ప్రమాదంపై నోటీసులు ఇచ్చామని వివరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించము..రూట్ కాజ్ వచ్చే వరకు సీడ్స్ కంపెనీ మూసేస్తున్నాము..సీడ్స్ కంపిణిని తక్షణమే మూసివేస్తున్నామని పేర్కొన్నారు.
జరిగిన ప్రమాదంపై సీడ్స్ కంపెని బాధ్యత వహించాలి..జరిగిన ప్రమాదంపై విచారణకు ఐసీఎమ్మార్ కు పంపుతున్నామని చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్. బాధితులకు ఎంత ఖర్చైన ప్రభుత్వమే బరిస్తుంది..జరిగిన తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.