హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్ : ఎయిర్ పోర్ట్ లో 5 కోట్ల విదేశీ వస్తువులు సీజ్

టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. విదేశీ వస్తువుల తో ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా బుక్కయ్యాడు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏకంగా 5 కోట్ల విలువ చేసే విదేశీ వాచ్ లను హార్దిక్ పాండ్యా నుంచి స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

దుబాయ్ నుంచి ముంబయి వచ్చిన ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద… విదేశీ వాచీలను గుర్తించిన కస్టమ్స్ అధికారులు… వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఐదు కోట్ల విలువ చేసే వాచ్ ను సీజ్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఐపీఎల్ అలాగే టి20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలల పాటు.. టీమిండియా క్రికెట్ లు దుబాయ్ లోనే ఉన్నారు. అయితే ఆ టోర్నీలో పూర్తి కాగానే… టీమిండియా జట్టు ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.