జీహెచ్ఎంసీ పరిధిలో దోమల బెడద.. కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశం

-

దక్షిణ భారత్‌లో తొలిసారిగా జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నిర్మూలన కోసం కూల్ ఫాగింగ్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.తొలుత పైలట్ ప్రాజెక్టులో భాగంగా 3 కూల్ ఫాగింగ్ మిషన్లను వినియోగించి దోమల నివారణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.మున్ముందు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నగరమంతా విస్తరిస్తామన్నారు. హాట్ ఫాగింగ్ వల్ల చిన్నపిల్లలు, వృద్దుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు రావడంతో వాటర్‌తో మిక్సింగ్ చేసి కొత్త లిక్విడ్‌తో ఉపయోగించే కూల్ ఫాగింగ్ మిషన్లతో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కూల్ ఫాగింగ్ ప్రక్రియకు అనుమతినిచ్చిందని, ప్రస్తుతం ఇండియాలో తొలిసారిగా గుజరాత్‌లో కూల్ ఫాగింగ్ అమలు చేస్తున్నారని గుర్తుచేశారు.హాట్ ఫాగింగ్ తో దోమల నిర్మూలన పూర్తిగా జరగడం లేదని, కూల్ ఫాగింగ్‌తో వందశాతం దోమలు చనిపోతాయని స్పష్టంచేశారు. అదేవిధంగా హాట్ ఫాగింగ్ మిషన్లతో ఏర్పడే డీజిల్ కాలుష్యం,సిబ్బంది చేతివాటంతో జరిగే డీజిల్ మిస్సింగ్‌ను కూల్ ఫాగింగ్ మిషన్లతో అరికట్టగలుగుతామన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news