Most Eligible Bachelor : రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్

-

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… జి ఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు మరియు వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ.. ఇటీవలే u/a సర్టిఫికెట్ కూడా అందుకుంది.

అలాగే దసరా కానుకగా అంటే అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను అన్ని థియేటర్లలో విడుదల చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాలో అఖిల్ మరియు పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని… వీరి మధ్య రొమాన్స్ సినిమాలోని హైలెట్ గా నిలుస్తుందని చిత్ర బృందం విశ్వాసం గా ఉంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా… అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర బృందం. అక్కినేని అఖిల్ మరియు పూజ హెగ్డే మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయనీ ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అఖిల్ అక్కినేని పెళ్లి కోసం తాపత్రయపడే సీన్స్ అలాగే… పూజా హెగ్డే అందాల ఆరబోతతో… ఈ ట్రైలర్ కే అందం వచ్చింది. అంతేకాదు జాతిరత్నాలు బ్యూటీ మరియు ఈశా రెబ్బ లాంటి హీరోయిన్లు కూడా ట్రైలర్ లో కనువిందు చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్… ఈ సినిమా అంచనాలను భారీగా పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news